BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Friday, October 15, 2010

శివానీ... భవానీ...!!

The following devotional song from a Telugu movie 'Swathi Kiranam', (essentially) praising Goddess Durga Bhavani; Her beauty, superpower..etc.,

Altogether,
Her Great Personality.

****

స్వాతికిరణం శివానీ... భవానీ...


పల్లవి :
శివానీ... భవానీ... శర్వాణీ...
గిరినందిని శివరంజని
భవ భంజని జననీ (2)
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...


చరణం : 1
శృంగారం తరంగించు
సౌందర్యలహరివని... ఆ.... (2)
శాంతం మూర్తీభవించు
శివానందలహరివని... ఆ... (2)
కరుణ చిలుకు సిరినగవుల
కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల
దరిజేర్చే దారియని
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు
సలుపలేని నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...


చరణం : 2
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
॥రౌద్రవీర॥
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
భీషణాస్త్ర కేళివనీ...
అద్భుతమౌ అతులితమౌ
లీల జూపినావనీ
॥గిరినందిని॥


చిత్రం : స్వాతికిరణం (1992)
రచన : సిరివెన్నెల
సంగీతం:
కె.వి.మహదేవన్‌
పుహళేంది
గానం : ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
****
విజయ దశమి శుభాకాంక్షలు!:)

No comments:

Post a Comment