BEee HAPPeeee!!

BEee HAPPeeee!!

Saturday, February 16, 2013

శ్రీ ఆంజనేయ దండకం

*image src: 
http://hanumaninfo.blogspot.in/

*aanJANeya dandakam
Telugu devotional!

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం 
భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే
రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ
సంకీర్తనల్ జేసి, నీరూపు వర్ణించి, నీమీదనున్ దండకం బొక్కటిన్ జేయనూహించి,
నీమూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి, నీదాసదాసుండనయ్, రామభక్తుండనై, 
నిన్ను నేగొల్చెదన్, నీకటాక్షంబునన్ జూపుమా!, వేడుకల్ జేయుమా!, నామొరాలించుమా!,
నన్ను రక్షించుమా!, అంజనాదేవి గర్భాన్వయా! దేవ!‌ నిన్నెంచ నేనంతవాడన్
దయాశాలివై జూడుమా!, దాతవయ్ బ్రోవుమా!, దగ్గరన్నిల్వుమా!, తొల్లి సుగ్రీవుకున్
మంత్రివయ్, స్వామికార్యర్థివైయుండి, శ్రీరామ సౌమిత్రులం జూచి, వారిన్విచారించి,
సర్వేశు పూజించి, యబ్భానుజన్ బంటుగావించి, యవ్వాలిన్జంపి, కాకుత్థ్స తిలకున్
దయా దృష్టి వీక్షించి, కిష్కింధకేతెంచి, శ్రీరామకార్యార్థివై లంకకేతెంచియున్, లంకిణిన్
జంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, 
నాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి సంతోషమున్ గూర్చి, సుగ్రీవుడున్ అంగదజాంబవంతాది నీలాదులన్ గూడి, యాసేతువున్ దాటి, వానరానీకముల్ మూక పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా, రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై, బోరి, 
బ్రహ్మాండమైనట్టి యాశక్తియున్ వేసి, యాలక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడేబోయి
సంజీవియున్ దెచ్చి, సౌమిత్రికిన్నిచ్చి, ప్రాణంబు రక్షించగా, కుంభకర్ణాది వీరాళితోపోరి
చండాడి, శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా, నంతలోకంబు
లానందమైయుండ యవ్వేళలన్ యవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు
జేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతోజేర్చి, నంత నయోధ్యకున్ వచ్చి,
పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ కూర్మిలేరంచు మన్నించినన్
శ్రీరామభక్తి ప్రశస్తంబుగానిన్ను నీనామ సంకీర్తనల్ జేసితే పాపముల్ బాయవే?
భయములున్ దీరవే? భాగ్యముల్ గల్గవే? సకల సామ్రాజ్యముల్ సర్వ సంపత్తులున్
గల్గవే? యోవానరాకార! యో భక్తమందార! యో పుణ్యసంచార! యో ధీర! యో
వీర! యో శూర! నీవేసమస్తంబు నీవే మహాఫలమ్ముగా వెలసి, యా తారకబ్రహ్మ
మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునుందాల్చి శ్రీరామయంచున్
మనఃపూతమై నెల్లప్పుడున్ తప్పకన్ దలతు నాజిహ్వయందుండుమా! వాత, పిత్త,
కఫ, హ్రుద్రోగాదిమహావ్యాధులన్, చోరాది దుందగులభయంబునుం బావుమా!
నీదీర్ఘదేహన త్రెలోక్య సంచారివై రామనామాంకితధ్యానివై, బ్రహ్మవై, బ్రహ్మతేజంబునన్
రౌద్రనిజ్వాల కల్లోల హా వీర హనుమంత ఓంకార, హ్రీంకార శబ్దంబులన్ భూతప్రేత
పిశాచ శాకినీ ఢాకినీ మోహినీగాలి దయ్యంబులన్ నీదువాలంబునన్ జుట్టి
నేలంబడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్
ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై మసలుమా! బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్యతేజంబునుం 
జూపుమా! రా! రా! నా ముద్దు హనుమంత! యంచున్, నిను బిలుతు దయాదృష్టి
వీక్షించి నన్నేలు నా స్వామి! నమస్తే సదా బ్రహ్మచారీ! నమస్తే ప్రపూర్ణార్తిహారీ!‌

నమో వాయుపుత్రా! 

నమస్తే, నమస్తే, నమస్తే, నమః

http://www.flickr.com/photos/shastrix/7186864845/

mp3 is available 4 download!

Singer 
parthasaradhi garu

Album 
- jai hanuman

Music - nihal ji

*youtube

http://www.youtube.com/watch?v=fqe6x5gA3oc


http://www.flickr.com/photos/shastrix/sets/72157594421554071/with/7186864845/

*****

a devotional song explains the importance of (chanting) 'shree rAma nAmamu'


*low volume is recommended



yours devotionally,
lsnbsquare-motherindia.

No comments:

Post a Comment